కేసీఆర్ కు హ‌రీష్ రావు వెన్ను పోటుకు ప్లాన్

మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్

hellotelugu-Kavitha

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్య‌వ‌స్థాప‌కురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావును ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆయ‌న భారతీయ జ‌న‌తా పార్టీతో నిరంత‌రం ట‌చ్ లో ఉన్నార‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి త‌న వ‌ద్ద నిరూపించేందుకు తగిన‌న్ని ఆధారాలు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. గురువారం క‌విత హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ గొప్ప నాయకుడు. కానీ ఆయన కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేక పోయారని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో . కేసీఆర్ కూడా గొప్ప నాయకుడే, కానీ ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా త‌న వారసుడు కాలేడన్నారు. ఒక‌వేళ అయితే గ‌నుక కేసీఆర్ వారసురాలిని నేనే అవుతానంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

హరీష్ మెదక్‌లో గెలిచిన‌ప్ప‌టికీ ఆయ‌న ప్ర‌తిక్ష‌ణం కేంద్రంలోని బీజేపీ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తున్నార‌ని, ఆ మేర‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం గురించి కూడా మాట్లాడారు. హరీష్ రావు రాజపుష్ప ఓపెన్ స్కైస్ విల్లాస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశాలకు “మిరియాలు-పసుపు పాలు” అనేది ఒక సంకేత పదం అని కవిత పేర్కొన్నారు. అయితే కేసీఆర్ హ‌రీష్ రావును గుడ్డిగా న‌మ్ముతున్నార‌ని, ఆయ‌న ఎంత త్వ‌ర‌గా మేలుకొంటే అంత మంచిద‌ని హిత‌వు ప‌లికారు తండ్రి గురించి. రాబోయే రోజుల్లో హ‌రీష్ రావు త‌ప్ప‌కుండా క‌కేసీఆర్ కు వెన్నుపోటు పొడ‌వ‌డం ఖాయ‌మ‌న్నారు.

Exit mobile version