న‌మ్మ‌కం, నాణ్య‌త వ్యాపార విజ‌యానికి మూలం

స్ప‌ష్టం చేసిన హెరిటేజ్ సంస్థ ఎండీ నారా బ్రాహ్మ‌ణి

hellotelugu-NaraBrahmani

ముంబై : నాణ్య‌త‌, నమ్మ‌కం అనేది సంపాదిస్తే చాలు ఎలాంటి వ్యాపారంలోనైనా రాణించేందుకు వీలు కుదురుతుంద‌ని స్ప‌ష్టం చేశారు హెరిటేజ్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు , భువ‌నేశ్వ‌రి కోడ‌లు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మ‌ణి. ‘ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 సంద‌ర్భంగా ఆమె ఎంపిక‌య్యారు . ఈ సంద‌ర్బంగా ముంబై వేదిక‌గా జ‌రిగిన అవార్డుల కార్య‌క్ర‌మానికి బ్రాహ్మ‌ణి హాజ‌రయ్యారు. అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, మార్పును తీసుకువచ్చే వారు , వ్యాపార రంగ నిపుణులకు ముంబైలో ఫార్చ్యూన్ ఇండియా అవార్డులను ప్రదానం చేసింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు అవార్డులను అందజేశారు.

దేశంలో పాల ఆధారిత విలువ-జోడించిన ఉత్పత్తుల రంగంలో విశేష గుర్తింపు పొందిన ‘హెరిటేజ్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప‌లు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి గల రెండు ప్రధాన కారణాలను మంత్రి లోకేష్ వివరించారు. వేగం, సేవ , స్థిరత్వం తమ విజయానికి రహస్యాలని ఆయన పేర్కొన్నారు. ప‌రిశోధ‌న ప్ర‌తి రంగంలో జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అబిప్రాయ‌ప‌డ్డారు .

Exit mobile version