Harish Rao : హైదరాబాద్ : కేంద్రంలోని మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆరుగాలం శ్రమించే రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కనీస మద్దతు ధర పండించిన పంటకు ఇవ్వక పోవడం దారుణమన్నారు. క్వింటాల్ గోధుమలకు రూ. 160 మద్దతు ధర పెంచి, వరికి మాత్రం 69 రూపాయలు పెంచుతారా అని నిలదీశారు. ఉత్తర భారతదేశ రైతులకు ఒక నీతి దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతా అని మండిపడ్డారు. ఎందుకు దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీకి చిన్న చూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్ రావు (Harish Rao).
MLA Harish Rao Slams PM Modi
తెలంగాణ బీజేపీకి చెందిన మంత్రులు ఇద్దరు కేంద్రంలో కొలువు తీరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మరి ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. రైతుల పక్షాన నిలబడతారా? కేంద్రానికి కొమ్ము కాస్తారా అని ఫైర్ అయ్యారు. శుక్రవారం హరీశ్ రావు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడా బాబులకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్న కేంద్రం నిరంతరం శ్రమించే అన్నదాతల గురించి మాత్రం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కనీస మద్దతు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరో వైపు ఏపీకి పెద్ద ఎత్తున యూరియా ఇచ్చిన కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : UN Security Council Approved : అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రికి లైన్ క్లియర్
















