Harish Rao Shocking Comments : రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారు

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ప్ర‌క‌ట‌న

Hello Telugu - Harish Rao Shocking Comments

Hello Telugu - Harish Rao Shocking Comments

Harish Rao : హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యా రంగంలో ఏర్పాటు చేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచు కున్నారని, వారంతా మాజీ సీఎం వెంటే ఉన్నారని హరీష్ రావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ తో పాటు హ‌రీశ్ రావు కూడా పాల్గొన్నారు.

Ex Minister Harish Rao Key Comments

కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసం పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకు వెళ్తారని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామన్నారు. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో గళం లేవనెత్తాలన్నారు. బీజేపీ పదేపదే బీసీల మాట చెబుతుంది కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకొని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని, బీజేపీ చేస్తున్న మోసాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

Also Read : KTR Fired on Congress : బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరుతో కాంగ్రెస్ మోసం

Exit mobile version