Minister Ashwini Vaishnaw Proven : అశ్విని వైష్ణ‌వ్ తెలంగాణ‌కు ఖుష్ క‌బ‌ర్

వందేభార‌త్ బోగీలు కూడా ఇక్క‌డే త‌యారు

Hello Telugu - Minister Ashwini Vaishnaw Proven

Hello Telugu - Minister Ashwini Vaishnaw Proven

Ashwini Vaishnaw : హ‌నుమ‌కొండ‌ జిల్లా – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ (Ashwini Vaishnaw) గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ‌కు. కాజిపేట మండ‌లంలో రూ. 750 కోట్లో రైల్వే త‌యారీ యూనిట్ ప‌నులు స్పీడప్ అందుకున్నాయి. ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. ఇది పూర్త‌యితే వేలాది మందికి ఉపాధి ద‌క్కుతుంద‌న్నారు. ద‌మ్మున్న నాయ‌కుడు న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో దేశం అన్ని రంగాల‌లో దూసుకు పోతుంద‌ని చెప్పారు. గతంలో ఎన్న‌డూ లేని విధంగా పెద్ద ఎత్తున రైల్వేల అభివృద్ది కోసం నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. అన్ని రైల్వే స్టేష‌న్ ల‌లో మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించామ‌ని చెప్పారు అశ్విని వైష్ణ‌వ్.

Ashwini Vaishnaw Key Comments

ఇదిలా ఉండ‌గా మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే 2026 నాటికి రైల్వే కోచ్ ల త‌యారీ స్టార్ట్ అవుతుంద‌ని అన్నారు. అంతే కాకుండా 150 లోకోమోటివ్ లు కూడా ఎగుమ‌తి అవుఆత‌య‌ని వెల్ల‌డించారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ కాజిపేట త‌యారీ యూనిట్ తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల అన్నారు. అయితే ఇక్క‌డ భూములు కోల్పోయిన రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం, ఉపాధి క‌ల్పించాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ స‌ర్కార్ పై ఉంద‌న్నారు. వాళ్ల సిఫార్సు మేర‌కు జాబ్స్ ఇస్తామ‌న్నారు. కిష‌న్ రెడ్డి మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చాలా మంది ఎయిర్ పోర్టు ఎప్పుడు వ‌స్తుంద‌ని అడుగుతున్నార‌ని , భూములు ఎంత త్వ‌ర‌గా ఇస్తే మామునూరు విమానాశ్ర‌యం అంత త్వ‌ర‌గా పూర్త‌వుతుంద‌న్నారు.

Also Read : YSRCP MP Midhun Reddy Shocking : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

Exit mobile version