Hari Hara Veera Mallu : ఎంఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu ). ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ కీ రోల్ పోషించారు. చారిత్రిక ఇతిహాసం నేపథ్యంగా దీనిని తెరకెక్కించారు దర్శకుడు జ్యోతి కృష్ణ. విచిత్రం ఏమిటంటే ఈ సినిమా రూపొందడానికి నానా తంటాలు పడింది. మొదట సృజనాత్మకత కలిగిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రారంభించాడు. కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఉన్నట్టుండి చావు కబురు చల్లగా చెప్పాడు దర్శకుడు. తాను హరి హర వీరమల్లు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు.
Hari Hara Veera Mallu Trailer Updates
ఈ సమయంలో తాను ఎందుకు తప్పుకున్నాడనే విషయంపై క్లారిటీ కూడా ఇవ్వలేక పోయాడు. ఆ తర్వాత తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఓ డాక్టర్ తో డేటింగ్ చేస్తూ ..చివరకు తనతో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే సినిమా తీసేందుకు ఫోకస్ పెట్టాడు. ఈ సమయంలో సినిమా పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిర్మాత నానా తంటాలు పడి చివరకు తన సోదరుడి తనయుడు జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. రేయింబవళ్లు శ్రమించి ఎలాగో హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేశాడు. చివరకు ట్రైలర్ ముందుకు వచ్చింది. మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం మరింత ఆదరణతో దూసుకు పోతోంది. గతంలో ఉన్న రికార్డ్ ను ఈ ట్రైలర్ బద్దలు కొట్టింది. భావోద్వేగాలను తెరపై అద్భుతంగా చిత్రీకరించాడు. సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మిగిలింది.
Also Read : India Sensational Record : ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన 4వ దేశంగా భారత్



















