Hari Hara Veera Mallu : ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu). చాలా కాలం గ్యాప్ తర్వాత రావడంతో ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు. అన్ని వర్గాలకు నచ్చేలా తీయడంలో దర్శకుడు జ్యోతి కృష్ణ సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేశారు. తొలుత చిత్ర కథను పవన్ కళ్యాణ్ కు వినిపించి, నచ్చ చెప్పి, ఒప్పించేలా చేసింది దర్శకుడు జాగర్లమూడి క్రిష్. తను చాలా కాలం పాటు నటుడితో జర్నీ చేశాడు. కానీ ఎందుకనో ఉన్నట్టుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది సినిమా రంగంలో ఒకింత విస్మయానికి గురి చేసింది.
Hari Hara Veera Mallu Release Updates
ఆ తర్వాత నిర్మాత ఎంఎం రత్నం నానా తంటాలు పడి చివరకు తన సోదరుడి తనయుడిని దర్శకుడిగా ప్రమోట్ చేశాడు. ఇది వర్కవుట్ అయ్యిందా లేదా అన్నది పక్కన పెడితే పూర్తిగా ప్రస్తుత రాజకీయాలు, మతం, చారిత్రక ఇతిహాసం నేపథ్యంగా హరి హర వీరమల్లును తీశాడు దర్శకుడు. పాలమూరు జిల్లాకు చెందిన పోరాట యోధుడు పండుగ సాయన్న కథను కాపీ చేశారంటూ మరో వైపు విమర్శలు కూడా వస్తున్నాయి. పాటలు , చిత్రీకరణ , గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ సినిమాకు ఒకింత బలం చేకూర్చినా సెకాండఫ్ కొంత సాగదీసినట్లు సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి మనసు పెట్టి చేశాడన్న టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా హరి హర వీరమల్లు సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ దేనని చెప్పక తప్పదు. పూర్తిగా తాను సనాతన ధర్మానికి ప్రతినిధినని పదే పదే ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈ తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఈ మేరకు రాబోయే రోజుల్లో వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read : Beauty Raashii Khanna – Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సరసన రాశీ ఖన్నా
