అమరావతి : ఏపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. బుధవారం శాసన సభలో పలువురు ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ధర్మరంలో రూ.38.03 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మెగా క్లస్టర్ ద్వారా స్వల కాలంలో 7 వేల మంది మహిళలకు, దీర్ఘకాలంలో 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు సవిత. ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల లోని మహిళలకు ఎంతో లబ్ధి కలుగనుందని అన్నారు. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అనంతపురం నియోజక వర్గంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలుస్తాం అని ప్రకటించారు.
ఇదే సమయంలో బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు ఎస్. సవిత. నేతన్నలకు అండగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు . ఇప్పటికే తమ అధినాయకుడు , పార్టీ బాస్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఏపీ 2026-27 బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించడం జరిగిందని చెప్పారు మంత్రి ఎస్ . సవిత. అంతే కాకుండా ప్రభుత్వం ఆప్కో ను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
