Guvvala Balaraju : హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయన బీజేపీ చీఫ్ రామచందర్ రావుతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఆగస్టు 11వ తేదీన తన అనుచరులతో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అచ్చంపేటలో మాజీ ఎంపీ రాములు, తన తనయుడు భరత్ కూడా బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ చీఫ్ తో భేటీ అయిన అనంతరం గువ్వల బాల రాజు (Guvvala Balaraju) మీడియాతో మాట్లాడారు. తన భార్యకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదని స్పష్టం చేశారు.
Guvvala Balaraju Key Comments
తాను అనుకుంటే గతంలోనే నా సతీమణికి పదవి ఇచ్చుకునే వాడినని అన్నారు గువ్వల బాలరాజు.
మహిళ అని కూడా చూడకుండా నా భార్యపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పాత బలరాజుని అయితే ఒక్కొక్కడి పళ్ళు రాల కొట్టేవాడినంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ప్రజాసేవలో నేను సక్సెస్ కావడమే నా భార్యకి ఇష్టం అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆమెకి ఏమాత్రం ఆసక్తి లేదని మరోసారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొన్నేళ్ల పాటు ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. నాలుగుసార్లు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేశారు. రెండుసార్లు శాసన సభ్యుడిగా గెలుపొందారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.
Also Read : Rural Jobs Interesting : ఏటా గ్రామీణ సంస్థల్లో 79 లక్షల జాబ్స్
