Guruvayur Krishna Interesting : శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప ద‌ర్శ‌నం

చిన్నశేష వాహనంపై గురువాయూరు ఆశీర్వాదం

Hello Telugu - Guruvayur Krishna Interesting

Hello Telugu - Guruvayur Krishna Interesting

Guruvayur Krishna : తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమ‌ల‌లో అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజైన గురువారం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి (Guruvayur Krishna) అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

Guruvayur Krishna Look Interesting

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతో పాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు, సివిఎస్వో ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి కుటుంబ సమేతంగా ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అంత‌కు ముందు భార‌త దేశానికి నూత‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రాధాకృష్ణ‌న్ స్వామి వారిని ద‌ర్శించుకుని పునీతుల‌య్యారు. భ‌క్తుల‌కు అభివాదం చేశారు.

Also Read : Minister Savitha Interesting Update : మ‌హిళా సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం : స‌విత

Exit mobile version