అంబ‌టి రాంబాబుకు ఊర‌ట‌నిచ్చిన కోర్టు

ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని ఆదేశం

hellotelugu-AmbatiRambabu

అమ‌రావ‌తి : గుంటూరు కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు ఊర‌ట‌నిచ్చేలా తీర్పు చెప్పింది. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు అంబ‌టి త‌ర‌పు న్యాయ‌వాది. విచిత్రం ఏమిటంటే ఏపీ కూట‌మి స‌ర్కార్ హ‌యాంలో అంబ‌టిపై 36కి పైగా కేసులు న‌మోద‌య్యాయి వివిధ పోలీస్ స్టేష‌న్ల‌లో. ఇదిలా ఉండ‌గా కొన్నింటి కేసుల‌కు సంబంధించి బెయిల్ రాగా మ‌రో కేసులో కుద‌ర‌లేదు. దీంతో త‌న‌కు ఇబ్బందిగా ఉంద‌ని, ఆరోగ్య రీత్యా ఆలోచించాల‌ని , కొంత వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరారు అంబ‌టి రాంబాబు గుంటూరు కోర్టును.

దీంతో విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒకే రోజు ఒక వ్య‌క్తిపై ఇన్ని కేసులు ఎలా న‌మోదు చేస్తారంటూ ప్ర‌శ్నించింది. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది. ఒకే అంశానికి సంబంధించి ప‌లు చోట్ల కేసులు న‌మోదు చేయ‌కూడ‌దంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రూల్స్ ప్రకారం జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది కోర్టు. తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేప‌ట్టింది ధ‌ర్మాస‌నం. ఇంటి నుంచి భోజనం, మంచం, బెడ్డు, దిండు, దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు, మెడికల్ పర్యవేక్షణ, ప్రత్యేకమైన రూము ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు అంబ‌టి త‌ర‌పు న్యాయ‌వాది.

Exit mobile version