మల్హాన్ పూర్ : జట్టు కెప్టెన్ ఎలా ఆడాలో ఆచరణలో చేసి చూపించాడు శుభ్ మన్ గిల్. అందుకే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తనను ఏరికోరి వన్డే, టెస్టు సీరీస్ లకు కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇక టి20 కూడా అప్పగించాలని అనుకుంది. కానీ ఫ్యాన్స్ దెబ్బకు వెనుకడుగు వేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ మెగా టోర్నీలో ఎలిమినేటర్ -2 మ్యాచ్ లో బలమైన రాజస్తాన్ రాయల్స్ ఆశలపై నీళ్లు చల్లాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజస్తాన్ . నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశాడు. తనకు తోడుగా రవీంద్ర జడేజా, ఫెరీరా సూపర్ షో చేయడంతో భారీ స్కోర్ సాధ్యమైంది.
ఇక మైదానంలోకి వచ్చీ రావడంతోనే కెప్టెన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్ విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరి కాంబినేషన్ టాప్ లో కొనసాగుతోంది ఈ సీజన్ లో. పవర్ ప్లే లో ప్రతి జట్టుపై భారీ స్కోర్ చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. గిల్ కేవలం 53 బంతుల్లో 104 పరుగులు చేస్తే సాయి సుదర్శన్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ఎలిమినేటర్ -2 నుంచి అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించింది. ఇదిలా ఉండగా తమ జట్టు టోర్నీ నుంచి వైదొలగడంతో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కన్నీటి పర్యంతం అయ్యాడు.
