Gujarat High Court Exclusive : ఆశారాం బాపు బెయిల్ పొడిగింపు

సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు పొడిగించిన కోర్టు

Hello Telugu - Gujarat High Court Exclusive

Hello Telugu - Gujarat High Court Exclusive

Gujarat High Court : గుజ‌రాత్ – గుజ‌రాత్ హైకోర్టు ఊర‌ట క‌ల్పించింది ఆశారాం బాపున‌కు. ఆయ‌న‌కు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ ను వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 3వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ తీర్పు చెప్పింది. త‌నంత‌కు తాను గా దేవుడిన‌ని ప్ర‌క‌టించుకున్నారు ఆశారాం బాపు. 2013వ సంవ‌త్స‌రంలో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. దీంతో ఆనాడు గాంధీన‌గ‌ర్ కోర్టు త‌న‌కు జీవిత ఖైదును విధించింది. త‌న‌కు ఆరోగ్యం బాగో లేదంటూ వాపోవ‌డంతో కోర్టు క‌నిక‌రించింది. త‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇవాల్టితో బెయిల్ పూర్తి కావ‌డంతో త‌న‌కు శ‌రీరం స‌హ‌క‌రించ‌డం లేదంటూ మ‌రోసారి కోర్టు ముందు విన్న‌వించాడు. దీంతో త‌న విన్న‌పాన్ని మ‌న్నించింది గుజ‌రాత్ హైకోర్టు (Gujarat High Court). ఈ మేర‌కు బెయిల్ మంజూరు ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ తర్వాత ఈ కేసును తదుపరి విచారణకు స్వీకరించనుంది.

Gujarat High Court Key Verdict

ఇదిలా ఉండ‌గా ఆశారాం అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతకు ముంద గుజరాత్ హైకోర్టు ఆగస్టు 21 వరకు ఆయన తాత్కాలిక బెయిల్‌ను పొడిగించింది, ప్రధానంగా వైద్య కారణాల దృష్ట్యా, ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ఉన్నారని , ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గమనించిన తర్వాత ఈ తీర్పు వెలువ‌డింది. జూలై 30న, సుప్రీంకోర్టు ఆశారాంకు తాత్కాలిక బెయిల్ పొడిగింపు కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను మంజూరు చేసింది. ప్రధానంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున. కోర్టు గతంలో ఆయనకు జూలై 7 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది . తరువాత మరో నెల పాటు ఉపశమనాన్ని పొడిగించింది.

Also Read : Tejashwi Yadav Shocking Comments : రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం ఖాయం

Exit mobile version