అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంగా స్వచ్చంధంగా అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంస్థ నిర్వహణపై ఆ మధ్యన నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రం కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా ఏపీ కూటమి సర్కార్ తీవ్ర ప్రయత్నం చేసింది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడారు. ఆయన చేసిన కృషి ఫలించింది. ఈ సందర్బంగా మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను.
కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగి పోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. దశాబ్దాల సేవా స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ కిఅభినందనలు తెలియ చేశారు నారా లోకేష్.

















