MLA Vasantha Krishna : డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా : తమ కులాన్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గౌడ సంఘాల నేతలు. ఆత్రేయపురం మండలంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కొత్తపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు మైలవరం ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే గౌడ కులస్థులకు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురించి నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేక పోతే రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులాలకు చెందిన వారంతా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా తమ వర్గీయులపై దాడులు ఎక్కువై పోయాయాని ఆవేదన వ్యక్తం చేశారు.
Gowda Community Slams MLA Vasantha Krishna Prasad
మొన్నిమద్యే ఉమ్మడి కృష్ణ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఉప్పల హారికపై దాడి మరవకు ముందే బీసీ లకు వెన్నుదాన్నుగా నిలుస్తూ బీసీల తరపున ప్రశ్నించే గొంతు గా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కావాలని ఆధారాలు లేకుండానే అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. బీసీలను రాజ్యాధికారం దిశగా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే వసంత కృష్ణ ప్రసాద్ కు, కూటమి సర్కార్ కు తగిన రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించారు. జోగి రమేష్ కు ధన బలం లేక పోవచ్చు కానీ మాలాంటి అన్నదమ్ముల బలం ఉందని మరిచి పోవదన్నారు.
Also Read : CM Revanth Reddy Clear Instructions : పథకాల అమలులో జాప్యం చేస్తే చర్యలు తప్పవు
















