ద‌ళ‌ప‌తి విజ‌య్ కు గ‌వ‌ర్న‌ర్ డెడ్ లైన్

మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు

hellotelugu-TVKVjay

త‌మిళ‌నాడు : రాష్ట్రంలో మెజారిటీ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న‌ప్ప‌టికీ ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది . టీవీకే విజ‌య్ పార్టీకి 108 సీట్లు వచ్చాయి. కానీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 సీట్లు రావాల్సి ఉంది. ఈ సంద‌ర్బంగా తాజాగా కీల‌క డెడ్ లైన్ విధించారు గ‌వ‌ర్న‌ర్. దీంతో ఏం జ‌రుగుతుంద‌నే దాని పై ఉత్కంఠ నెల‌కొంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల మధ్య గవర్నర్‌తో మరోసారి భేటీ అయ్యారు విజ‌య్. కాగా భారత జాతీయ కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని విజయ్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ భేటీ జరిగింది. కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసేందుకు విజయ్ గురువారం చెన్నైలోని లోక్ భవన్‌కు చేరుకున్నారు.

గవర్నర్‌తో జరిగిన ఈ సమావేశంలో విజయ్‌తో పాటు తమిళగ వెట్రి కజగం (టీవీకే) సీనియర్ నాయకులు ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని విజయ్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ భేటీ జర‌గ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మెజారిటీ మార్కుకు ఇంకా ఐదు స్థానాలు తక్కువగానే ఉన్నాయి. రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, టీవీకే తన ఎమ్మెల్యేలలో పలువురిని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్‌కు తరలించింది. అక్కడ విజయ్‌కు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నట్లు సమాచారం. విజయ్‌కు ఇంతకుముందు అందించిన కాన్వాయ్ పోలీసు భద్రతను ఉపసంహరించు కున్నారని కూడా నివేదికలు సూచించాయి. గవర్నర్ సమావేశం తర్వాత జరగాల్సి ఉన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయిందని వార్తలు రావడంతో, అది జరుగుతుందనే ఊహాగానాలు కూడా సన్నగిల్లాయి.

Exit mobile version