చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి చెక్ పెట్టారు టీవీకే విజయ్. తమ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు గవర్నర్ రాజేంద్రను . కానీ ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారు. కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాల ఒత్తిళ్ల మేరకు నడుచుకున్నారు. 108 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీని కాదని ఆయన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో కూడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దీంతో విజయ్ సంచలన ప్రకటన చేశారు. అలా గనుక జరిగితే రాష్ట్రంలో తమ పార్టీ తరపున గెలిచిన 108 మంది సభ్యులంతా స్వచ్చంధంగా రాజీనామా చేస్తారని ప్రకటించారు. దీంతో గత్యంతరం లేక గవర్నర్ తల వంచారు.
ఇదిలా ఉండగా టీవీకే పార్టీ తరపున పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇప్పటికే 5 సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ బేషరతుగా విజయ్ సర్కార్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లేఖ కూడా ఇచ్చింది. బయటి నుంచి సీపీఐ, సీపీఎం మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా విజయ్ కి వీసీకే పార్టీ కూడా సపోర్టుగా నిలిచింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది టీవీకే పార్టీ. దీంతో తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు చెరో మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు విజయ్. మిత్రపక్షాలను గౌరవిస్తూ అధికారంలో వాటా ఇవ్వాలని టీవీకే అధినేత నిర్ణయం తీసుకున్నారు.మొత్తంగా ఉత్కంఠకు తెర దించాడడు. సీఎం గా ప్రమాణం చేసేందుకు సిద్దం అయ్యాడు విజయ్.
