వనపర్తి జిల్లా : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలో సంక్షేమం కోసం కృషి చేస్తోందని స్పష్టం చేశారు
తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్.
తుర్క కాషా సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీని ప్రారంభించారు వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ పాల్గొన్నారు. మైనారిటీ తుర్క కాషా కమ్యూనిటీ పునరావాస పథకం కింద తుర్క కాషా ముస్లిం సమాజానికి జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ చైర్మన్, సీడీసీ చైర్మన్, కౌన్సిలర్లు, టీజీఎంఎఫ్‌సీ ఏజీఎం ప్రవీణ్ కులకర్ణి, మహబూబ్‌నగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి , టీజీఎంఎఫ్‌సీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సమానత్వ భావనతో ప్రతి పౌరుడిని ఆదరిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తకోటకు రావడం, లబ్ధిదారులను కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడారు మంత్రి, వారు చేసే పని చాలా కష్టమైనదని అన్నారు. చేతులతో రాళ్లు కొట్టడం చాలా కష్టమైన పని. ప్రతిరోజూ మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు అజారుద్దీనన్. ఇకపై ఈ జనరేటర్లు, యంత్రాల సహాయంతో మీ పని సులభంగా, వేగంగా జరుగుతుందన్నారు. శారీరక శ్రమ తగ్గి, మీ ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరికరాలు మీ జీవితాన్ని మరింత మెరుగు పరుస్తాయని చెప్పారు.
తుర్క కాషా సమాజంతో పాటు ఇతర మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.
















