సివిల్స్ అభ్య‌ర్థుల‌కు ఉచితంగా స‌ర్కార్ శిక్ష‌ణ

ప్ర‌క‌టించిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్

hellotelugu-APBCStudyCircle

విజయవాడ : ఏపీకి చెందిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స్ట‌డీ స‌ర్కిల్ తీపి క‌బురు చెప్పంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా ఈ ఏడాది ఆగస్టు 21 నుండి 30 వరకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష – 2026లో అర్హత సాధించి, తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉచిత మాక్ ఇంటర్వ్యూలు , వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ కార్యదర్శిచ‌ సంచాలకులు ఎన్. మోహన రావు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ , సహాయ సహకారాలు అందించనున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన, ప్రస్తుత సివిల్ సర్వెంట్లు, వివిధ రంగాల నిపుణులు, అనుభవజ్ఞులైన వృత్తి నిపుణుల ఆధ్వ‌ర్యంలో మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్న‌ట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ విధానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమకాలీన అంశాలు (కరెంట్ అఫైర్స్) , వ్యక్తిత్వ మదింపు (Personality Assessment) తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వాస్తవ యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు ప్రతి అభ్యర్థికి వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలు, అవసరమైన సలహాలతో పాటు ఆత్మ విశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత మెంటరింగ్ అందించ‌నున్న‌ట్లు తెలిపారు.

​ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు డా. బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ https://apstudycircle.apcfss.in/  ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు నమోదు చేసుకావాల‌ని కోరారు కార్య‌ద‌ర్శి.

Exit mobile version