ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

SRBS నిధులు ఇచ్చేందుకు నిర్ణయం

hellotelugu-APSTC

అమ‌రావ‌తి : ఓ వైపు తెలంగాణ‌లో ఆర్టీసీ ఉద్యోగులు , కార్మికులు స‌మ్మె సైర‌న్ మోగిస్తే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా , విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోంది. అక్క‌డి కూట‌మి స‌ర్కార్ ఉద్యోగుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారికి తీపిక‌బురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు SRBS నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది స‌ర్కార్. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించిన మీద‌ట ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆర్టీసీ ఎండీ ద్వార కా తిరుమ‌ల రావు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లో 2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లింపులు చేస్తామ‌ని వెల్ల‌డించారు. 8,450 మంది APSRTC ఉద్యోగులకు రూ.75 కోట్లు విడుదల చేశామ‌న్నారు ఎండీ. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం SRBS ఏర్పాటు చేసి, నెలనెలా కొంత పొదుపు చేసుకున్నారు APSRTC ఉద్యోగులు. ఆర్టీసీ విలీనం అనంతరం SRBSను రద్దు చేసింది గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం. కాగా పొదుపు చేసిన మొత్తాన్ని ఇవ్వాలని కూట‌మి స‌ర్కార్ కు విన్న‌వించారు. సీఎం సానుకూలంగా స్పందించ‌డంతో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించింది.

Exit mobile version