Gold : దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గక తగ్గక రోజురోజుకు కొత్త రికార్డులు నమోదు చేస్తూ బంగారం ధర తులానికి లక్షా పదివేల రూపాయల మార్క్ చేరువలో నిలిచింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా డాలర్ బలహీనత, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం, అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా బంగారం (Gold) ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
- ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹1,07,780 | 22 క్యారెట్లు – ₹98,810
- ముంబై: 24 క్యారెట్లు – ₹1,07,630 | 22 క్యారెట్లు – ₹98,660
- హైదరాబాద్: 24 క్యారెట్లు – ₹1,07,630 | 22 క్యారెట్లు – ₹98,660
- విజయవాడ: 24 క్యారెట్లు – ₹1,07,630 | 22 క్యారెట్లు – ₹98,660
- చెన్నై: 24 క్యారెట్లు – ₹1,07,630 | 22 క్యారెట్లు – ₹98,660
- బెంగళూరు: 24 క్యారెట్లు – ₹1,07,630 | 22 క్యారెట్లు – ₹98,660
వెండి ధర: ప్రస్తుతం కిలోకు ₹1,25,900 వద్ద ఉంది.
ఇక మరోవైపు, ఈ నెలలోనే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్తో పాటు పలువురు అధికారులు సంకేతాలు ఇవ్వడంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ పరిణామాల ఫలితంగా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read : Gold Price Growth : చూస్తుండగా మరోసారి పెరిగిన పసిడి ధరలు
