Gold : దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొత్త రికార్డు సృష్టించాయి. శనివారం నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.98,060కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,980గా నమోదైంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,07,070
- ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,980
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,060
అదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,27,100గా ఉంది.
నిపుణుల విశ్లేషణ
బంగారం ధరలు రానున్న రోజుల్లో కూడా తగ్గే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచ పెట్టుబడిదారుల్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది. దీనితో వారు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై పరిశీలన కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read : PM Kisan Interesting Update : పీఎం కిసాన్ 21వ విడతపై కేంద్రం కీలక అప్డేట్
