Gold Price Growth : ఒక్కరోజులో మరోసారి పెరిగిన పసిడి ధరలు

ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా గుర్తించబడింది...

Hello Telugu - Gold Price Growth

Hello Telugu - Gold Price Growth

Gold : దేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. శనివారం నాటికి 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ₹99,450 వద్దకు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ₹1,08,490 దాటింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా గుర్తించబడింది.

విశ్లేషకుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ బలహీనత, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు, అలాగే గ్లోబల్‌ ఆర్థిక అనిశ్చితి బంగారం ధరలను ఎగబాకేలా చేస్తున్నాయి.

Gold – రోజు లోపల భారీ పెరుగుదల

శనివారం ఉదయం నుంచి గంటల వ్యవధిలోనే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.

దీంతో, 22 క్యారెట్ల బంగారం ధర కూడా లక్ష రూపాయల మార్క్‌కి చేరువైంది.

వెండి కూడా తగ్గేదేలే

బంగారం తరహాలోనే వెండి ధరలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. కిలో వెండి ధర ఒకే రోజు ₹2,000 పెరిగి దేశవ్యాప్తంగా ₹1,28,000 చేరుకుంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళలో అయితే కిలో వెండి ధర ₹1,38,000 వద్ద కొనసాగుతోంది.

నిపుణులు ఆభరణాలు కొనుగోలు చేయదలచిన వినియోగదారులు తాజా ధరలను తప్పనిసరిగా తనిఖీ చేసి, సరైన సమాచారం ఉన్నప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Also Read : Today Gold Price : రానున్న రోజుల్లో మళ్లీ పెరగనున్న పసిడి ధరలు

Exit mobile version