Gold Price Growth : గంటల వ్యవధిలోనే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు

ఈ రోజు ఉదయం కొన్ని గంటల్లోనే మరో రూ.1,420 ఎగసి సామాన్యులను షాక్‌కు గురి చేసింది.

Hello Telugu - Gold Price Growth

Hello Telugu - Gold Price Growth

Gold : దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. నిన్నటి నుంచి నేటి ఉదయం వరకు దాదాపు వెయ్యి రూపాయలు పెరిగిన బంగారం (Gold), ఈ రోజు ఉదయం కొన్ని గంటల్లోనే మరో రూ.1,420 ఎగసి సామాన్యులను షాక్‌కు గురి చేసింది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,310గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,450గా కొనసాగుతోంది. తులం బంగారం ధర రూ.1,20,700కు చేరుకుంది.

Gold – ప్రధాన నగరాల్లో ధరలు

వెండి పరిస్థితి

బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,51,000 వద్ద ఉంది. హైదరాబాద్‌, చెన్నై, కేరళలో ఈ ధర మరింత ఎక్కువగా ఉండి రూ.1,61,000ను తాకింది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

ప్రపంచ బులియన్‌ మార్కెట్‌లో కూడా ధరలు ఎగిసిపోతున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 3,864 డాలర్ల వద్ద, ఔన్స్‌ వెండి ధర సుమారు 47 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

వినియోగదారుల ఆందోళన

పండుగ సీజన్‌ సమీపిస్తున్న వేళ బంగారం ధరలు ఇంత వేగంగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారికి ఈ పెరుగుదల పెద్ద షాక్‌గా మారింది.

Also Read : Silver Price Shocking : సంచలన స్థాయికి చేరిన వెండి ధరలు

Exit mobile version