Today Gold Price : తగ్గినట్టే తగ్గి దుమ్ములేపుతున్న బంగారం ధరలు

ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ తాజా నివేదికలో పేర్కొంది...

Hello Telugu - Today Gold Price

Hello Telugu - Today Gold Price

Gold : దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఒకప్పుడు రూ.90 వేలకు చేరిన పది గ్రాముల బంగారం ఇప్పుడు లక్ష రూపాయల మార్క్ దాటేసింది. ప్రస్తుతం పది గ్రాములకు రూ.99,500 నుండి రూ.1,10,000 మధ్య ట్రేడవుతున్న బంగారం (Gold), రాబోయే 2026 ప్రథమార్థంలో రూ.1,10,000 నుండి రూ.1,25,000 వరకు పెరిగే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ తాజా నివేదికలో పేర్కొంది.

Gold Price Updates

రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనమైతే ఈ అంచనాలు ఇంకా ఎక్కువ స్థాయికి చేరవచ్చని నివేదిక హెచ్చరించింది. 2026 మొదటి భాగంలో రూపాయి మారకం విలువ సగటున 87 నుండి 89 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం బలంగా కొనసాగుతోంది. 2025లో ఇప్పటివరకు గ్లోబల్ బంగారం ధరలు దాదాపు 33 శాతం పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, యూఎస్ ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి వంటి అంశాలు బులియన్ మార్కెట్‌కు మద్దతు ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

2025 మిగిలిన కాలంలో ప్రపంచ బులియన్ ధర ఔన్సుకు USD 3,400 – 3,600 మధ్య ఉండవచ్చని, 2026 మొదటి భాగంలో అది USD 3,600 – 3,800 వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

బంగారం ధరలు ఇలా ఎగబాకుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో కూడా పెట్టుబడిదారులు, వినియోగదారులు ఖరీదైన బంగారం కొనుగోళ్లకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం నిపుణులది.

Also Read : GST on Gold Price : బంగారంపై జీఎస్టీ ఎంతో తెలుసా? అయితే ఇది చుడండి

Exit mobile version