Gold : దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఇటీవల లక్షా 19 వేల వరకు చేరిన బంగారం రేట్లు ఇప్పుడు కొంత తగ్గి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి.
శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) ఉదయం 6 గంటల సమయంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.930 తగ్గి రూ.1,14,430కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,890గా ఉంది.
ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.1,49,900గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,39,900గా కొనసాగుతోంది.
Gold – ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు)
- ముంబై: 24 క్యారెట్ రూ.1,14,430 | 22 క్యారెట్ రూ.1,04,890
- చెన్నై: 24 క్యారెట్ రూ.1,14,650 | 22 క్యారెట్ రూ.1,05,090
- కోల్‌కతా: 24 క్యారెట్ రూ.1,14,430 | 22 క్యారెట్ రూ.1,04,890
- బెంగళూరు: 24 క్యారెట్ రూ.1,14,430 | 22 క్యారెట్ రూ.1,04,890
- ఢిల్లీ: 24 క్యారెట్ రూ.1,14,580 | 22 క్యారెట్ రూ.1,05,040
- హైదరాబాద్, విజయవాడ: 24 క్యారెట్ రూ.1,14,430 | 22 క్యారెట్ రూ.1,04,890
- పూణే: 24 క్యారెట్ రూ.1,14,430 | 22 క్యారెట్ రూ.1,04,890
చెన్నైలో బంగారం రేట్లు కొంచెం ఎక్కువగా ఉండగా, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాల్లో ధరలు సమానంగా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
- హైదరాబాద్, విజయవాడ: రూ.1,49,900
- చెన్నై: రూ.1,49,900
- ఢిల్లీ: రూ.1,39,900
- ముంబై: రూ.1,39,900
- కోల్‌కతా: రూ.1,39,900
- బెంగళూరు: రూ.1,39,900
- పూణే: రూ.1,39,900
- వడోదర: రూ.1,39,900
దక్షిణాది నగరాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉండగా, ఉత్తర భారత నగరాల్లో తక్కువగా ఉన్నాయి. స్థానిక మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.
నిపుణుల సూచన ప్రకారం, బంగారం మరియు వెండి ధరలు తరచుగా మారుతుంటాయి కాబట్టి కొనుగోలు లేదా పెట్టుబడి చేయాలనుకునే వారు ప్రస్తుత మార్కెట్ రేట్లను మరోసారి పరిశీలించడం అవసరం.
Also Read : Gold Price Drop : నేడు మరోసారి దిగువకు వచ్చిన పసిడి ధరలు



















