Godavari : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా పెద్ద ఎత్తున ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలో ప్రాజెక్టులన్నీ నిండి పోయాయి. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు అలుగులు పారుతున్నాయి. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల తరువాత, వరద ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎడీ హెచ్చరించింది పునరావాసం కోసం అవసరమైన చర్యలు తీసుకుని ఆదేశించారు ఖమ్మం జిల్లా కలెక్టర్. అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు, గోదావరిలో (Godavari) స్నానాలకు వెళ్లవద్దని ప్రజలకు చెప్పామని, పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించబడ్డాయని స్పష్టం చేశారు.
Godavari Floods Update
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆలయ పట్టణంలో గోదావరి నదిలో నీటి మట్టం 48 అడుగులకు చేరిన తర్వాత ఆదివారం రెండవ వరద హెచ్చరిక జారీ చేయబడిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు నది హెచ్చరిక స్థాయికి చేరుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. పునరావాసం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను అనుసరించి, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, ఇత శాఖల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Trump Health Condition Critical : ట్రంప్ కు అనారోగ్యం పుకార్లు షికార్లు..?

















