Goa CM : గోవా : ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa CM) కీలక ప్రకటన చేశారు. ఎంఎస్ఎంఈలకు పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఔత్సాహికులకు ఊతం ఇచ్చేలా తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల ద్వారా చిన్న, మధ్య తరహా సంస్థలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని పేర్కొన్నారు సీఎం. గోవా ఈ లక్ష్యానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్రక్రియలను సరళీకృతం చేయడం, స్వదేశీ ఉత్పత్తులు భారతదేశంలో, ప్రపంచ వ్యాప్తంగా గర్వంగా ప్రకాశించేలా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు.
Goa CM Key Comments on MSME’s
గోవాలో పారుల్ విశ్వ విద్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంస్కరణలను ప్రారంభించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ చొరవ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ 2.0 వైపు ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా రాష్ట్రాలు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారని, అందుకు అనుగుణంగా తాము ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం. ఇవాల్టి నుంచి ప్రారంభం అయ్యే జీఎస్టీ సంస్కరణలు రాష్ట్ర ఆర్థికాభివృద్దికి మరింత దోహదం చేస్తాయన్నారు.
కొత్త ఐడియాలతో వచ్చే వారికి, నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే ప్రతి ఒక్క ఔత్సాహికులకు తాము పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి సావంత్. పెట్టుబడిదారులకు గోవా రాష్ట్రాన్ని కేరాఫ్ గా మారుస్తామని ప్రకటించారు. పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు.
Also Read : Minister Rajnath Singh Warning : ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరివేస్తాం : రాజ్‌నాథ్ సింగ్


















