Global Summit 2025 Important Update : తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఘ‌నంగా ఏర్పాట్లు

ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశం

Hello Telugu - Global Summit 2025 Important Update

Hello Telugu - Global Summit 2025 Important Update

Global Summit : హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Global Summit) ను ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా నిర్వ‌హించ‌నుంది. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. తరలి రండి ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి అన్న నినాదంతో ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తోంది స‌మ్మిట్ ను. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరు కానున్నారు . ఈ సదస్సు నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి.

Global Summit 2025 Key Update

ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మ‌హీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే సమాచారం పంపించారు. యూఏఈ రాజవంశానికి చెందిన, ఎమిరేట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ డైరెక్టర్ షేఖ్ తారిక్ బిన్ ఫైజల్ అల్ ఖసిమి, డుయిష్ బోర్సే తో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

Also Read : Womens Football Committee Important Update : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ కోసం 14 స్టేడియాలు

Exit mobile version