Dharma Mahesh : హైదరాబాద్ : ఓ వైపు బిగ్ బాస్ 9 దూసుకు పోతోంది. జియో స్టార్ లో ప్రసారం అవుతోంది. రేటింగ్ కూడా బాగానే వస్తోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి గౌతమి సంచలన కామెంట్స్ చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న రీతు చౌదరిపై నిప్పులు చెరిగింది. తన భర్త ధర్మ మహేష్ (Dharma Mahesh) ను వలలో వేసుకుందని, తరుచూ తను వచ్చి వెళుతోందంటూ సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రీతు చౌదరితో కలిసి ఉంటూ తన భర్త ధర్మ మహేష్ తనను మోసం చేశాడని గౌతమి ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాదు ధర్మ మహేష్, రీతు చౌదరి, బిగ్ బాస్ కిర్రాక్ సీతపై కూడా గౌతమి షాకింగ్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
Dharma Mahesh Wife Shocking Comments on Ritu Chaudhary
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , నటుడిగా గుర్తింపు పొందాడు ధర్మ మహేష్ బిగ్ బాస్ పోటీదారు రీతు చౌదరి తరచుగా తన భర్తను అప్పుడప్పుడు సందర్శిస్తుందని గతంలో ఆరోపించిన తర్వాత, గౌతమి ఇప్పుడు కొత్త బాంబు పేల్చింది. అయితే ఉన్నట్టుండి గౌతమి ఈసారి బేబీ ఫేమ్ కిర్రాక్ సీతను లక్ష్యంగా చేసుకుంది. రీతు, కిర్రాక్ సీతతో కలిసి తన భర్త నటించిన డ్రింకర్ సాయి చిత్రాన్ని గుర్తు చేసింది.ఈ ఇద్దరు నటీమణులు మహేష్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారని ఆరోపించింది. నటి ఐశ్వర్య శర్మను కూడా ఆమె పనికిరానిదంటూ ఫైర్ అయ్యింది గౌతమి.
సీత తన రెస్టారెంట్ వ్యాపారంలో జోక్యం చేసుకుందని గౌతమి ఆరోపించింది. నేను ఇప్పటికే 15 రెస్టారెంట్లు నడుపుతున్నాను. అందులో ఎంటర్ కావాలని అనుకుందని పేర్కొంది. దీని వెనుక తన భర్త ఉన్నాడని మండిపడింది. 13 సంవత్సరాల ప్రేమ, 2019 వివాహం తర్వాత, ధర్మ మహేష్‌తో తన బంధం రీతు చౌదరి కారణంగా విచ్ఛిన్నమైందని ఆమె వెల్లడించింది.
Also Read : Hero Shah Rukh Khan : అవార్డు అందుకున్న షారుక్ ఖాన్..రాణి ముఖర్జీ


















