వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ పై గౌతం గంభీర్ ఫోక‌స్

రాహుల్, పంత్, జ‌డేజా శ‌కం ముగిసిందా

hellotelugu-GautamGambhir

న్యూఢిల్లీ : భార‌తీయ క్రికెట్ రంగంలో కీల‌క‌మైన చ‌ర్చ కొన‌సాగుతోంది. వ‌చ్చే 2027లో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అటు టెస్టు ఫార్మాట్, ఇటు వ‌న్డే ఫార్మాట్ ల‌కు సంబంధించి శుభ్ మ‌న్ గిల్ ను కెప్టెన్ గా ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. ఇటీవ‌లే త‌న‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు కూడా ద‌క్కింది. ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతం గంభీర్ త‌న ఫోక‌స్ వ‌చ్చే ఐసీసీ టోర్నీల‌పై ఉంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. తాజాగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో టీం ఇండియా కైవ‌సం చేసుకుంది. చరిత్ర‌ను తిర‌గ రాసింది. అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ఈ త‌రుణంలో గంభీర్ చెప్ప‌క‌నే చెప్పాడు కీల‌క‌మైన మార్పులు ఉండ బోతున్నాయ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌న్డేలో పాతుకు పోయిన సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌నున్న‌ట్లు టాక్.

ఇందులో కేఎల్ రాహుల్, ర‌వీంద్ర జ‌డేజా వ‌చ్చే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ తుది జ‌ట్టులో ఉండ‌క పోవ‌చ్చ‌ని క్రికెట్ వ‌ర్గాల‌లో చ‌ర్చ కొన‌సాగుతోంది. ODI జట్టుకు సంబంధించి ప్రధాన నిర్ణయాలు , జట్టు నిర్వహణ , సెలెక్టర్ల నుండి ఆశించే ఛాన్స్ లేక పోలేద‌ని మాజీ క్రికెట‌ర్లు పేర్కొంటున్నారు. ఇక‌ అనుభవం క‌లిగిన‌ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే తన చివరి వ‌న్డే సీరీస్ ఆడ‌బోతున్నాడు. త‌న స్థానంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ రానున్నాడు. బౌన్స్ , పేస్ కీలకమైన దక్షిణాఫ్రికాలో 2027 ప్రపంచ కప్ జరగనున్నందున సంజు సామ్సన్ , ఇషాన్ కిషన్ తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు పొందుతారని భావిస్తున్నారు.

Exit mobile version