Gautam Gambhir Strong Focus : అంద‌రి క‌ళ్లు హెడ్ కోచ్ గౌతం గంభీర్ పైనే

ఆసియా కప్ లో శాంస‌న్ కు ఛాన్స్ ద‌క్కేనా

Hello Telugu - Gautam Gambhir Strong Focus

Hello Telugu - Gautam Gambhir Strong Focus

Gautam Gambhir  : ముంబై : ఈనెల లోనే ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగే మెగా టోర్నీకి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. కోట్లాది మంది ఈ టోర్న‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు వేయి క‌ళ్ల‌తో. ఇప్ప‌టికే ఆయా జ‌ట్లు ప్ర‌క‌టించాయి. ప్ర‌స్తుతం అంద‌రి క‌ళ్లు ప్ర‌త్యేకంగా భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పైనే ఉన్నాయి. ఇందుకు కార‌ణం కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తాడా ఇవ్వ‌డా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అగార్క‌ర్ ఓపెనింగ్ విష‌యంలో జితేష్ శ‌ర్మ‌, శుభ్ మ‌న్ గిల్ వ‌స్తార‌ని ప్ర‌క‌టించాడు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం అయ్యింది. ఇదే స‌మ‌యంలో త‌న స‌త్తా ఏమిటో చూపించాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ . త‌న స్వంత గ‌డ్డపై జ‌రుగుతున్న కేర‌ళ క్రికెట్ లీగ్ లో కీల‌క‌మైన ఇన్నింగ్స్ లు ఆడాడు. అద్భుత‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

Gautam Gambhir Highliting

ఏకంగా ఒకే ఒక్క‌డు 30కి పైగా సిక్సులు కొట్టాడు. దీంతో సెలెక్ట‌ర్ల‌కు , బీసీసీఐ బాద్ షా కార్య‌ద‌ర్శి జే షాకు, హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు స‌వాల్ విసిరాడు త‌న ఆట తీరుతో. దీంతో అంద‌రి దృష్టి గౌతం గంభీర్ పైనే ఉంది. ప్ర‌స్తుతం సెప్టెంబ‌ర్ 10 నుంచి ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జ‌ట్టుకు నాయ‌క‌త్వం సూర్య కుమార్ యాద‌వ్ వ‌హిస్తుండ‌గా శుభ్ మ‌న్ గిల్ ను వైస్ కెప్టెన్ చేశారు. త‌న‌కు టి20 ఫార్మాట్ లో అంత‌గా అనుభ‌వం లేదు. ఈ స‌మ‌యంలో త‌న‌ను ఓపెనింగ్ కు పంపిస్తామంటూ అగార్క‌ర్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ఈ స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్ తో జోరు పెంచిన సంజూ శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తాడా లేక రాజ‌కీయాల కార‌ణంగా ప‌క్క‌న పెడ‌తాడా అన్న‌ది వేచి చూడాలి. మ‌రి గౌతం నిర్ణ‌యం ఎటు వైపు ఉండ‌నుందోనని త‌న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : Minister Piyush Goyal Interesting Update : జీఎస్టీ ప‌న్నుల విధానం దేశాభివృద్దికి ఊతం

Exit mobile version