Pushpa 2 : ముంబై – దమ్మున్న దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ పోషించిన చిత్రం పుష్ప -2 (Pushpa 2) సంచలనం రేపింది. ఏకంగా భారతీయ సినిమా చరిత్రలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాలలో రెండవ మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. ఇందులో కిస్సక్ అంటూ లవ్లీ గర్ల్ శ్రీలీల కెవ్వు కేక అనిపించేలా చేసింది. పుష్ప -1 సినిమాలో సమంత రుత్ ప్రభు ఊ అంటావా అంటూ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసింది. ఇక పుష్ప-2 చిత్రంలో శ్రీలీల దుమ్ము రేపింది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా దీని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఎఫెక్టు వినాయక చవితి పండుగపై పడింది.
Pushpa 2 Ganesh Statue Viral
ప్రస్తుతం ముంబైని ముంచెత్తుతున్నాయి వినాయక విగ్రహాలు. గణేష్ చతుర్థి వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు గణేశుడి పట్ల లోతైన భక్తితో పూజలు చేస్తున్నారు. వీధుల్లో, వివిధ సృజనాత్మక రూపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇటీవలి కాలంలో, సినిమా హీరోల అవతారాలలో ఉన్న విగ్రహాలు కూడా ప్రజాదరణ పొందాయి. అలాంటి ఒక విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో పుష్ప – 2 చిత్రం తర్వాత రూపొందించిన గణేష్ విగ్రహాలు భారీ ఆకర్షణగా మారాయి. కానీ ఈసారి వేడుకలు తదుపరి స్థాయికి వెళ్లాయి. వినాయక విగ్రహం హల్ చల్ చేస్తోంది. సినిమాలోని అల్లు అర్జున్ పాత్ర గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. దీనిని ఎర్ర చందనంతో అలంకరించారు. హెలికాప్టర్ దగ్గర తుపాకీతో నిలబడి ఉన్న పుష్ప రాజ్ విగ్రహాన్ని ఉంచారు.
Also Read : Shilpa Shirodkar Movie Interesting : శిల్పా శిరోద్కర్ జటాదర ఫస్ట్ లుక్ రిలీజ్















