ఆడ‌క పోయినా గిల్, పంత్ ల‌కు అంద‌లం

ప్ర‌తిభ క‌న‌బ‌ర్చినా సంజూ శాంస‌న్ పై వివక్ష‌

hellotelugu-SanjuSamson

హైద‌రాబాద్ : దేశివాలి క్రికెట్ టోర్నీలో అద్భుతంగా రాణించినా , టి20 సీరీస్ కు ఎంపిక చేసినా ఆడేందుకు మాత్రం కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు ఛాన్స్ రావ‌డం లేదు. ఏదో వంక పెట్టి త‌న‌ను ఆడ‌కుండా చేస్తు్నారు హెడ్ కోచ్ గౌతం గంభీర్, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ వ్యాఖ్యాత సునీల్ గ‌వాస్క‌ర్ అయితే సీరియ‌స్ గా స్పందించారు. ఎలాంటి నైపుణ్యం లేని జితేష్ శ‌ర్మ‌ను వికెట్ కీప‌ర్ గా , ఓపెన‌ర్ గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. కొన్ని మ్యాచ్ ల‌లో రాణించినంత మాత్రాన టి20 ఫార్మాట్ లో ఇంకా కుదురుకోని శుభ్ మ‌న్ గిల్ ను ఓపెనింగ్ కు పంపించ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అంతే కాదు కోచ్ ను, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఇదిలా ఉండ‌గా అర్హత లేని ఆటగాళ్లకు అనేక వైఫల్యాల తర్వాత కూడా అవకాశాలు లభిస్తూ ఉండటం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సంజూ శాంస‌న్ తో పాటు రింకూ సింగ్ ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంది. ఇక శాంస‌న్ విష‌యానికి వ‌స్తే మిడిల్ ఆర్డర్‌లో ఆడిన తర్వాత కూడా ఆసియా కప్‌లో భారతదేశం తరపున మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు . ఫైనల్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ను అందించాడు. ఓమ‌న్ తో జరిగిన మ్యాచ్‌లో టాప్ బ్యాటింగ్ చేశాడ‌, ఆసియా కప్ చరిత్రలో అర్ధ సెంచరీ సాధించిన భారతదేశం తరపున తొలి వికెట్ కీపర్ అయ్యాడు.

Exit mobile version