సంక్షోభం అంచున భార‌త దేశం : చింతా మోహ‌న్

మోదీ స‌ర్కార్ నిద్ర పోతోంద‌న్న మాజీ కేంద్ర మంత్రి

hellotelugu-ChintaMohan

తిరుప‌తి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ నిప్పులు చెరిగారు. రోజు రోజుకు దేశంలో ప‌రిస్థితులు దారుణంగా దిగ‌జారుతున్నాయ‌ని ఆవేద‌న చెందారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మన దేశంలో, ప్రపంచంలో ఆశించిన మేర ప్ర‌గ‌తి క‌నిపించ‌డం లేద‌న్నారు. డొనాల్డ్ ట్రంప్ ఓ పిచ్చోడ‌ని, ఆయ‌న త‌న‌కు తోచిన విధంగా పాల‌న సాగిస్తూ ప్ర‌పంచాన్ని భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు . సెక్స్ రాకెట్ లో ప్రపంచ దేశాధినేతలు ఇరుక్కున్నారని పేర్కొన్నారు. ఎఫ్స్టీన్ అనే వ్యక్తి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, దేశాధినేతలకు ముండలను సప్లయ్ చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు చింతా మోహ‌న్.

రష్యాకు చెందిన 30 ఏళ్ల అమ్మాయిలతో, 70, 80 ఏళ్ల వయసు గల అధినేతలు సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్నార‌ని , వీళ్లా ప్ర‌పంచ దేశాల‌కు అధిప‌తులుగా ఉన్న‌ది అంటూ మండిప‌డ్డారు. న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఇరాన్ దేశంలో ఉన్నాయనే భయంతో బాంబులతో, మిస్సైల్స్ తో దాడుల‌కు ఇజ్రాయెల్, అమెరికా దిగిందంటూ పేర్కొన్నారు. చాలా మంది ఆయిల్ కోసం దాడి చేస్తున్నారంటూ మ‌భ్య పెట్టార‌ని అస‌లు ర‌హ‌స్యం ఇదేనంటూ బాంబు పేల్చారు. రేపటి దాక గ్యాస్ ఉంటుందని చెప్పగలిగే మొనగాడు ఎవరైనా ఉన్నారా? ధరలు పెరగదని చెప్పే ధీరుడు ఎవరైనా ఉన్నారా? ఈ దేశంలో అని ప్ర‌శ్నించారు

Exit mobile version