ఆదిలాబాద్ జిల్లా : రాష్ట్రంలో రాబంధుల పాలన సాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో గెలిచిన నూతన సర్పంచుల ఆత్మీయ సన్మాన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. రైతుబంధు కాలం పోయింది రాబందు పాలన వచ్చిందన్నారు. అదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేకుండా పోయిందన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తైపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
సోయా రైతులను పట్టించుకునే వాళ్ళు లేరన్నారు. ఇట్ల మొత్తం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధ్వజమత్తారు. తెలంగాణ రైతన్న మా పార్టీ హయాంలో రాజు లెక్క ఉండేవాడని గుర్తు చేశారు కేటీఆర్. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆయన ఇంటి ముందుకు వచ్చాయన్నారు. అందుకే ఏనాడూ తెలంగాణలోని రైతన్న కేసీఆర్ మీద కోపంతో లేడన్నారు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చి, 7000 కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసిన చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.
