రేవంత్ రెడ్డి కామెంట్స్ కేటీఆర్ సీరియ‌స్

చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దంటూ ఫైర్

hellotelugu-KTR

హైద‌రాబాద్ : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా నోరు పారేసుకున్నారు ప్ర‌స్తుత సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సీఎం చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. చిల్లర వ్యాఖ్యలపై స్పందించారు కేటీఆర్. నదీ జలాల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నవా రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన రేవంత్ రెడ్డి వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ఛీకొడుతున్నా ఇంకా మారడా అని ప్ర‌శ్నించారు కేటీఆర్. శాసన సభలో..జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం అని భ‌గ్గుమ‌న్నారు.

2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అని జోష్యం చె్పారు. వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం అని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌నత సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. 420 హామీల‌తో గ‌ద్దెను ఎక్కింది చాల‌క పైగా అడ్డ‌గోలుగా ఆరోప‌ణ‌లు చేయ‌డం, విమ‌ర్శించ‌డం అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. పాల‌న చేత‌కాక , రియ‌ల్ ఎస్టేట్ దందా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నార‌ని ఆరోపించారు. కారుకూత‌లు కూయ‌డం మానుకోవాల‌ని, తాను చేస్తున్న కామెంట్స్ ను చూసి జ‌నం త‌ల దించుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

Exit mobile version