హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నీకు అంత సీన్ లేదన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కోట్లాది ప్రజల సాక్షిగా అబద్దాలు మాట్లాడటం దారుణమన్నారు. నీ నోరు పూర్తిగా చెడి పోయిందన్నారు. కేసీఆర్ మాట్లాడితే నీకు వచ్చిన నొప్పి ఏంది అంటూ నిలదీశారు. నువ్వు రండవు, నీవు మాట్లాడిన మాటలు సీఎం పదవి స్థాయికి తగదన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు గల్లీ స్థాయి నాయకుడివి అని మల్లొకసారి నిరూపించుకున్నావని అన్నారు. తెలంగాణ చరిత్రలో ఇలాంటి దిగజారుడు మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ప్రజల నుంచి, చట్టం నుంచి నువ్వు తప్పించు కోలేవని వార్నింగ్ ఇచ్చారు.
నిన్ను రాజకీయంగా బండలు కట్టి మూసీలో వేయడం ఖాయమన్నారు. సీఎం స్థాయిలో ఎలా ఉండాలని ఆలోచించి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ ముందు నువ్వు ఓ బచ్చాగాడివి అని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం నువ్వు పని చేస్తున్నావో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అసలు వాస్తవాలు మాట్లాడిన కేసీఆర్ పై ఇలా నోరు పారేసు కోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు ఎంత గొట్టం గాడు, కేసీఆర్ కాలి గోటికి సరోపోడు అని మేము కూడా అనొచ్చన్నారు. కానీ తమకు సభ్యత, సంస్కారం ఉందని కానీ అలా అనడం తమకు నచ్చదన్నారు. మోదీ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా నీళ్లు తీసుకు పోతుంటే అడ్డుపడతా అని చెప్పడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు జగదీశ్ రెడ్డి. ఇక నుంచి రండ మాటలు మాట్లాడటం మాను కోవాలని హితవు పలికారు.
