మాజీ సీజేఐ గ‌వాయ్ షాకింగ్ కామెంట్స్

చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా

hellotelugu-JusticeBRGavai

ముంబై : మాజీ సీజేఐ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ కోటాకు సంబంధించి క్రీమీలేయర్‌కు మద్దతు ఇచ్చినందుకు విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పారు. ముంబై విశ్వ విద్యాలయంలో సమాన అవకాశాలను ప్రోత్సహించడంలో నిశ్చయాత్మక చర్య పాత్ర అనే అంశంపై ప్ర‌సంగించారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లకు క్రీమీలేయర్ సూత్రాన్ని వర్తింప చేయాల‌ని తీర్పులో పేర్కొన్నందుకు తన సొంత సమాజానికి చెందిన వ్యక్తుల‌చే తాను తీవ్ర ఇబ్బందులు , విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాన‌ని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దృష్టిలో నిశ్చయాత్మక చర్య వెనుకబడిన వ్యక్తికి సైకిల్ అందించడం లాంటిదన్నారు. అలాంటి వ్యక్తి సైకిల్‌ను ఎప్పటికీ వదులు కోకూడదని స్ప‌ష్టం చేశారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, దానిలో పొందు పరచబడిన నిశ్చయాత్మక చర్యకు కూడా రూపశిల్పి అని గవాయ్ అన్నారు.

నా దృష్టిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించినట్లుగా సామాజిక, ఆర్థిక న్యాయం దృక్పథం అది కాద‌ని అన్నారు. అధికారిక అర్థంలో కాకుండా నిజమైన అర్థంలో సామాజిక, ఆర్థిక న్యాయాన్ని తీసుకు రావాలని ఆయన కోరుకున్నార‌ని అర్థం చేసుకోవాల‌న్నారు మాజీ సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ .ఖర్గే కానీ ఈ వ్యక్తులకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజ్యాంగ పదవికి రిజర్వేషన్లు లేవని కూడా తెలియదని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన కార్యదర్శి కొడుకు, గ్రామ పంచాయతీ పాఠశాలలో చదివిన కార్మికుడి కొడుకు రాజ్యాంగంలో పొందు పరచబడిన సమానత్వ పరీక్షను సంతృప్తి పరచగలరా అని ఆయన ప్రశ్నించారు. నేను దేశ వ్యాప్తంగా పర్యటించాను, ప్రపంచ వ్యాప్తంగా తిరిగాను. షెడ్యూల్డ్ కులానికి చెందిన చాలా మంది వ్యక్తులు ప్రధాన కార్యదర్శి లేదా పోలీసు డైరెక్టర్ జనరల్ లేదా రాయబారులు, హైకమిషనర్లుగా మారడాన్ని తానుచూశాన‌న్నారు.

Exit mobile version