ఫామ్ తాత్కాలికం క్లాస్ శాశ్వ‌తం : గంభీర్

సంజూ శాంస‌న్ ఫామ్ పై హెడ్ కోచ్ కామెంట్స్

hellotelugu-GauthamGambhir

కేర‌ళ : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్రెస్ కాన్ఫ‌రెన్స్ లో త‌ను మాట్లాడాడు. ఇవాళ కీల‌క‌మైన ఆఖ‌రి 5వ టి20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది కేర‌ళ వేదిక‌గా. ఇది ప్ర‌త్యేకించి స్వంత మైదానం కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్. ఇదే వేదిక‌పై ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ప్ర‌స్తుతం కీవీస్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఇందులో త‌ను కేవ‌లం 10, 6, 0, 24 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. దీంతో త‌న‌ను ఓపెన‌ర్ గా త‌ప్పిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో హెడ్ కోచ్ గా ఉన్న గౌత‌మ్ గంభీర్ ను మీడియా ప్ర‌శ్నల వ‌ర్షం కురిపించింది.

దీనిపై కూల్ గా స్పందించాడు. అనుకోకుండా దిమ్మ తిరిగేలా స‌మాధానం ఇచ్చాడు. సంజు శాంసన్ ఫామ్ గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఐదవ టీ20లో కొత్త ఓపెనింగ్ జోడీని చూసే అవకాశం ఉందా? అని అడుగగా ..త‌న‌కు కానీ, టీం మేనేజ్మెంట్ కు కానీ ఎలాంటి త‌న విష‌యంలో అనుమానం లేద‌న్నాడు. ఫామ్ తాత్కాలికం, కానీ క్లాస్ శాశ్వతం. అతని ఫామ్ గురించి జట్టులో నో డౌట్ అన్నాడు గంభీర్.. అతను నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు నెట్స్‌లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు, అదే మాకు ముఖ్యం అని స్ప‌ష్టం చేశాడు భార‌త హెడ్ కోచ్.

Exit mobile version