భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన లియోనెల్ మెస్సీ

hellotelugu-Messi

ఢిల్లీ : ప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం, అర్జెంటీనా టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌ను మూడు రోజుల పాటు ఇండియాలో ప‌ర్య‌టించాడు. ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగిసింది. ఈ సంద‌ర్బంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో త‌న దేశానికి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడాడు. ఇక్క‌డి సంస్కృతి , ప్రేమ‌, ఆద‌రాభిమానాల‌ను తాను మ‌రిచి పోలేన‌ని అన్నాడు. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు మెస్సీ. భార‌త దేశంలో ఫుట్ బాల్ క్రీడ‌కు మంచి , ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్తు ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. తాజాగా మెస్సీ చేసిన కామెంట్స్ క్రీడా వ‌ర్గంలో మ‌రింత ఆస‌క్తిని రేపేలా చేసింది. ఇదే స‌మ‌యంలో ఈ 38 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆట‌గాడు త‌న ఇన్ స్టా లో సంతోష‌క‌ర‌మైన క్లిప్ కూడా జత చేశాడు.

ఇందులో భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్, అనేక మంది యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో తన సంభాషణలు ఉన్నాయి. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముందుగా కోల్ క‌తాకు వెళ్లాడు. అక్క‌డి నుంచి హైద‌రాబాద్ ను సంద‌ర్శించాడు. సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. అత్యంత ప్ర‌సిద్ది చెందిన చౌమొహ‌ల్లా ప్యాలెస్ లో ఓ రాత్రి ఉన్నాడు. నేరుగా ముంబైకి వెళ్లాడు. అక్క‌డ క్రికెట్ దిగ్గ‌జంతో క‌ర‌చాల‌నం చేశాడు. త‌ర్వాత దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలు మోపాడు మెస్సీ. మొత్తంగా తాను ప్రేమ క‌లిగిన న‌గ‌రం హైద‌రాబాద్ ను మ‌రిచి పోలేనంటూ కితాబు ఇచ్చాడు.

Exit mobile version