స్మార్ట్ కిచెన్ల ద్వారా అన్ని స్కూళ్ల‌కు ఆహారం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విద్యా శాఖ మంత్రి లోకేష్

hellotelugu-NaraLokesh

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రిగింది. ఈ కీల‌క స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు మంత్రులు. క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ఆధ్వ‌ర్యంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ సంచ‌ల‌నంగా మారింది. కేవ‌లం 3 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మండ‌ల ప‌రిధిలోని అన్ని ప్ర‌భుత్వ స్కూళ్ల‌కు నాణ్య‌వంత‌మైన‌, రుచిక‌ర‌మైన ఆహారాన్ని అందించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇందుకు సంబంధించిన స్మార్ట్ కిచెన్ ఏర్పాటు గురించి సీఎంకు వివ‌రించారు. ఈ సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ ను ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ ను సంద‌ర్శించాల‌ని సూచించారు . ఇదిలా ఉండ‌గా మంత్రి నారా లోకేష్ స్పందించారు. కడపలోని స్మార్ట్ కిచెన్ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చూపించామ‌ని చెప్పారు. ఈ స్మార్ట్ కిచెన్ విధానం త‌న‌కు బాగా న‌చ్చింద‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. స్మార్ట్ కిచెన్ల నిర్మాణం కోసం భూములను పరిశీలించాలని ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ కీల‌క స‌మావేశంలో సీఎస్ విజ‌యానంద్ తో పాటు మంత్రులు, ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు.

Exit mobile version