తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా బుధవారం ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి . విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనదలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మొబైల్ నంబరు: 8977779471కు కాల్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అంశాన్ని చర్చించి, పరిష్కరించుకునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును సంబంధిత వినియోగదారులకు పంపడం జరిగిందన్నారు. ఎసిఎస్పిడిసిఎల్ పరిధిలో ప్రతి నెలా మొదటి బుధవారం ఆయా సర్కిళ్ళ సూపరింటెండింగ్ ఇంజనీర్ల కార్యాలయాల్లోనూ, 3వ ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనూ నిర్విహించే పారిశ్రామిక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఇకపై రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
















