మదీనా ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఆర్థిక సాయం

ఒక్కో కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం

hellotelugu-CM

హైద‌రాబాద్ : ఈ ప్ర‌భుత్వం మీదని, ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదని , మీకు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు భ‌రోసా ఇచ్చారు. స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో బాధిత కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు సీఎం. ఆర్థిక సహాయం అందజేశారు. ఆనాడు ప్ర‌మాద ఘ‌ట‌న తెలుసుకున్న వెంట‌నే మంత్రి అజ‌హ‌రుద్దీన్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మ‌దీనాకు పంపిన విషయాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

స‌హ‌జంగా దేశం బ‌య‌ట జ‌రిగే ప్ర‌మాదాల్లో మృతి చెందిన వారికి ప్ర‌భుత్వాలు ప‌రిహారం చెల్లించ‌వు అని అన్నారు. కానీ, ప్రజా ప్రభుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హాయం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నదని చెప్పారు సీఎం. ప్ర‌మాదంలో మృతి చెందిన 44 కుటుంబాల వారికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌, తీవ్రంగా గాయ‌ప‌డిన వారి కుటుంబానికి రూ.3 ల‌క్ష‌ల చొప్పున చెక్కుల‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశామ‌న్నారు. బాధిత కుటుంబాల‌కు సాయం చేయ‌డం త‌న‌కు మ‌రింత సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాంప‌ల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ .తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version