CM Chandrababu- Hero Meeting : ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సినిమా ప్రముఖులు

థియేటర్‌ల బంద్ అంశానికి సంబంధించి పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యారు...

Hello Telugu - CM Chandrababu Special Meet

Hello Telugu - CM Chandrababu Special Meet

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ని కలిసి మాట్లాడుతారు. ఆ తర్వాత పవన్‌తో పాటు చంద్రబాబు (CM Chandrababu) నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా అని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. థియేటర్‌ల బంద్ అంశానికి సంబంధించి పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యారు.

Movie Artists meet CM Chandrababu today

ఏపీలో థియేటర్‌ల పరిస్థితి.. సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను సినీ ప్రముఖులు కలవనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లయినా ఏపీలో అంతంత మాత్రంగానే సినీ ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏమి కోరతారనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. చంద్రబాబు(CM Chandrababu) సూచన మేరకు సినీ ప్రముఖులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. ఈ భేటీకి మొత్తం 35 నుంచి 40 మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుమారు 35 నుంచి 40 మంది వరకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. వారిలో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు ఉన్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఉన్నారు.

Also Read : Ex IPS Prabhakar Rao Inquiry : మరోసారి సిట్ విచారణకు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు

Exit mobile version