న్యూఢిల్లీ : బొద్దింకల జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న తమ పిలుపు అందుకుని స్వచ్చంధంగా వేలాది మంది నిరసనలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అని పేర్కొన్నారు. నిన్న, మనలో వేలాది మంది చరిత్ర సృష్టించామని తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద చేసిన శాంతియుత నిరసన కేంద్రం కళ్లు తెరిపించేలా చేసిందన్నాడు. మనం ఐక్యమైనప్పుడు బొద్దింకల వంటి వాళ్ళం కూడా ఏమి చేయగలమో ప్రభుత్వానికి ఒక ట్రైలర్ లాగా చూపించిందన్నారు అభిజిత్ దీప్కే.
నిన్న మాతో చేరిన వారిలో చాలా మంది ఇంతకు ముందు ఎప్పుడూ నిరసనలో పాల్గొనలేదని అన్నాడు. కానీ విద్యా వ్యవస్థపై తమ తీవ్రమైన కోపాన్ని, నిరాశను వ్యక్తం చేయడానికి మా సామూహిక ఉనికి వారికి ధైర్యాన్నిచ్చిందని తెలిపాడు. మన గొంతులను వినిపించక పోతే మార్పు రాదన్నాడు. ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నపిల్లలు, విద్యార్థులతో సహా, శాంతియుత నిరసనే మన గొప్ప బలం అని నిరూపించిన మీ అందరికీ ఈసందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపాడు అభిజిత్ దీప్కే. ఐక్యమైన, శాంతియుత ఉద్యమాన్ని ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నాడు. బొద్దింకలమైన మేము వారికి ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
కానీ ఇది ఇక్కడితో ముగియదు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక తరం మొత్తానికి అన్యాయం చేశారు. రాబోయే 7 రోజుల్లోగా ఆయనను తొలగించక పోయినా లేదా ఆయన పదవి నుంచి తప్పుకోక పోయినా, మేము మా నిరసనను క్షేత్రస్థాయిలో కొనసాగించక తప్పదని స్పష్టం చేశాడు.
