ఖమ్మం జిల్లా : రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రైతులకు కీలక సూచనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య తాను గుజరాత్ కు వెళ్లానని, అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుందన్నారు. అక్కడి నుంచి ప్రతి రోజు అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయని చెప్పారు. ఇక్కడ ఆయిల్ ఫామ్ కి తుమ్మల నాగేశ్వరరావు స్టార్ట్ చేశారని తెలిపారు. ప్రతి జిల్లాలకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని బావిస్తున్నారని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ 300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారని ప్రశంసలు కురిపించారు.
ఈ ప్రాంత రైతాంగానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగ పడుతుందని అభిప్రాయ పడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ముఖ్యంగా అన్నదాతలు ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలని హితవు పలికారు. మా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంట పండదు అనే అపోహ నుండి తుమ్మల నాగేశ్వర్ రావు బయటకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు ఆయిల్ ఫామ్ పై ఆసక్తి చూపుతున్నారని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలనీ ఈ ప్రాంత రైతులను కోరుతున్నానని అన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ ఆయిల్ ఫ్యాక్టరీ కి రూపం తెచ్చిన మంత్రికి ధన్యవాదలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.


















