చెన్నై : మలేషియాలోని కౌలాలంపూర్ లో తాను నటించిన జన నాయగన్ ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా తిరుగు ప్రయాణంలో చెన్నైకి చేరుకున్నారు. తనను చూసేందుకు, తాకేందుకు, పలకరించేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు చెన్నై లోని ఎయిర్ పోర్ట్ కు. దీంతో భారీ ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా తనను కలిసేందుకు దూసుకు వచ్చారు.
ఊహించని విధంగా అభిమానుల రద్దీ మధ్య విజయ్ తడబడి పడిపోయారు .బ్యాలెన్స్ కోల్పోవడంతో సెక్యూరిటీ పట్టుకున్నారు. చివరకు భారీ భద్రత మధ్య తను ఇంటికి వెళ్లి పోయాడు. మలేషియా నుండి తిరిగి వచ్చిన విజయ్‌ను భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు.
అతను నిష్క్రమణ ప్రాంతం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా కారులో ఎక్కడానికి క్షణాల ముందు, అభిమానుల రద్దీ పెరగడంతో తడబడి కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని పైకి లేపి కారులోకి ఎక్కించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ఇప్పటికే ప్రకటించాడు దళపతి విజయ్. ఆడియో లాంచ్‌లో విజయ్ తన అభిమానుల కోసం సినిమా రంగాన్ని వదిలేస్తున్నట్లు వెల్లడించారు. ఆ అభిమానులే అతనికి ‘కోట’ (దుర్గం) నిర్మించారు, ఇది తమిళనాడు శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయానికి నిలయమైన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌తో సమానమైన ఒక తమిళ చిహ్నం. నేను సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా. కానీ ఫ్యాన్స్ తనకు రాజ భవనం నిర్మించుకునేలా చేశారని చెప్పాడు.
















