సచివాలయంలో రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ అరెస్ట్

డూప్లికేట్ పోలీస్ నంటూ మ‌రో వీడియో రిలీజ్

hellotelugu-FakePolice

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య కాంగ్రెస్ స‌ర్కార్ కొలువు తీరాక స‌చివాల‌యంలో అప‌రిచితుల తాకిడి పెరిగింది. ఎవ‌రు వ‌స్తున్నారో ఎవ‌రు వెలుతున్నారో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. తాజాగా సెక్ర‌టేరియ‌ట్ సాక్షిగా త‌న‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలుస‌ని, ఎవ‌రైనా త‌న‌ను క‌ల‌వాలంటే త‌నను క‌లిస్తే చాల‌ని ర‌వి అనే వ్య‌క్తి రీల్స్ చేశాడు. ఆపై సోష‌ల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. ఇది సంచ‌ల‌నంగా మారింది. చివ‌ర‌కు త‌న‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. అరెస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉండ‌గా పోలీసుల ముందు నేను డూప్లికేట్ పోలీసులు అంటూ మరో వీడియో విడుదల చేయ‌డం విశేషం.

తెలంగాణ సచివాలయంలో పోలీసు కానిస్టేబుల్ గా నటిస్తూ రీల్స్ చేశాడు ర‌వి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమోటో గా తీసుకుని నకిలీ పోలీస్ పై సెక్షన్లు 204, 205, 319, 318(4), 353 బి.ఎన్.ఎస్.. ఐటీ యాక్ట్ 66-డి కింద కేసు న‌మోదు చేశారు. త‌న అస‌లు పేరు తాటూరి ర‌వి అలియాస్ చ‌ర‌ణ్ యాద‌వ్, నిఖిల్ యాద‌వ్. ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం నిందితుడు పోలీస్ యూనిఫాంలో తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో రీల్ చేశాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరిగా నటిస్తూ, తాను ఒక పోలీస్ కానిస్టేబుల్‌నని అతను తప్పుడు ప్రచారం చేశాడు.

అపాయింట్‌మెంట్ లేకుండానే ముఖ్యమంత్రితో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేయగలనని అందులో పేర్కొన్నాడు. రవి గతంలో 2018లో గోషామహల్‌లోని ఒక క్యాంటీన్‌లో పనిచేశాడు. అక్కడ అతను తరచుగా పోలీసు అధికారులను గమనించేవాడు.యూనిఫాంతో ముడిపడి ఉన్న అధికారం.. ప్రతిష్ట పట్ల వ్యామోహం పెంచుకుని.. అతను ఇటీవల అంబర్‌పేట్‌లో ఒక పోలీస్ కిట్‌ను కొనుగోలు చేశాడు.

Exit mobile version