ఉద్రిక్త‌త‌ల వేళ దాయాదుల మ‌ధ్య క‌ర‌చాల‌నం

పాకిస్తాన్ స్పీక‌ర్ తో విదేశాంగ మంత్రి జై శంక‌ర్

hellotelugu-SJaaiShankar

బంగ్లాదేశ్ : భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల వేళ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈ సంద‌ర్బంగా బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్ అయాజ్ సాదిక్ , భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఎదురు ప‌డ్డారు. ఈ ఇద్ద‌రూ క‌ర‌చాల‌నం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఉద్రిక్త‌త చోటు చేసుకుంది ఇరు దేశాల మ‌ధ్య‌. పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింది పాకిస్తాన్ కు. ఈ త‌రుణంలో అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు త‌ను చేసిన సూచ‌న‌ల మేర‌కు పాకిస్తాన్ పై ఆప‌రేష్ సిందూర్ ను నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ.

ఇదిలా ఉండ‌గా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల సందర్భంగా ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లుసుకున్నారు. మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీనిని పాకిస్తాన్ అగ్ర నాయ‌క‌త్వం ఆస‌క్తిగా గ‌మ‌నించింది. 2025 సంవ‌త్స‌రం ప్రారంభంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ ఘ‌ట‌న‌తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. అప్ప‌టి నుంచి ఇండియా, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య అంత‌రం పెరిగింది. మ‌రింత ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఇదే క్ర‌మంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ కూడా మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయినా ఇండియా మాత్రం డోంట్ కేర్ అని పేర్కొంది. ఇంకోసారి భార‌త్ వైపు క‌న్నెత్తి చూసినా చూస్తూ ఊరుకునేది లేద‌ని, దాడులు త‌ప్ప‌వ‌ని, మ‌రోసారి ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌డ‌తామ‌ని ఇవాళ దేశ ఆర్మీ చీఫ్ ద్వివేది వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version